ఇది నా జీవితంలో జరిగిన ఒక సంఘటన, మన సిస్టం ఎలా వుంది అనే దానికి ప్రత్యక్ష సాక్షము. అది 2005 జూన్ నేల అప్పుడే మన దగ్గర వర్షలు పడటం మొదలు అవుతున్నాయి. నేను నా ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఇంట్లో ఏవో వ్యవసాయం పనులు అంటే కంద చేనుకి కాపలాకి వెళ్ళేవాడిని, కంద మే నెలలో వేస్తారు, జున్ నేలలో మొలకలు వచ్చి పచ్చగా కనిపిస్తుంటాయి. వాటిని చూసి పసువులు వచ్చి తొక్కి ఆగం చేస్తాయి. అవి వచ్చే వేళలో జాగర్తగా వుంది మిగతా సమయంలో చెట్టుకింద నిద్రా పోవటమే. ఆరోజు శనివారం ఉదయం వెళ్లి మద్యహ్నం బోజనానికి ఇంటికి వచ్చాను. అమ్మ అన్నం వడ్డించి, ఏదో లేటరు వచ్చింది నీకూ అని తెచ్చి పక్కన పెట్టింది. అది ఐఐటి నుంచి వచ్చిన ఎడ్మీషన్ లేటరు అని అర్ధం అయింది, సీటు వచ్చిందని ముందే తెలియంటం వలనా పెద్ద అనంద పడ వలసిన ఆవసరం రాలేదు. బోజనం పూర్తి చేసి వచ్చి చిన్నగా ఆరుబయట పందిరి కింద వేసిన నులక మంచం మీద పడుకొని, ఆ లెటర్ ఓపెన్ చేసి చూసాను. ఆ రోజు శనివారం వెంటనే సోమవారం లోపల ఎడ్మీషన్ ఫీజు కట్టాలని వుంది. మళ్ళి మళ్ళి చూసి సరిగానే వుందని నిర్ధరించుకొన్నాను.
లక్కీగా అంతక ముందు సంవత్సరం మా వురికి BSNL ల్యాండ్ లైన్లు వచ్చాయి, వెంటనే ఐఐటిలో వున్న నా స్నేహితునికి ఫోన్ చెశాను, ఎంత సేపు ట్రై చేసినా స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. తర్వత వాళ్ళ ఇంటికి చేస్తే వాడు ఇంటిలో వున్నాడు, వాడి స్నేహితులు కూడా ఎవరు ఐఐటిలో లేరని చెప్పాడు. ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. అప్పటికే 3:30 అయిపొయింది, వెంటనే బయలు దేరి వెళ్లటం తప్పితే వేరే మార్గం కానీపించలేదు. ఇంటిలో డబ్బులు అడిగాను, లేవు. ఆరోజు శనివారం బ్యాంకు కూడా మద్యహ్నం వరకే వుంటుంది. తెలిసిన వాళ్ళంధరిని అడిగి ఎంత వుంటే అంత తీసుకొని, అది పెద్ద మొత్తం కాకపోయినా పల్లెటురులలో అది ఉల్లో బ్యాంకు వుండటంతొ, ఆవసరం లేనిదే ఎవరు ఇళ్లలో డబ్బులు వుంచుకోరు. నలుగురి దగ్గర తీసుకొన్నాను. తెలిసిన వాళ్ళు విజయవాడలో వుంటే ఫోన్ చేసి, కథ అంత చెప్పి ఢిల్లీకి తర్వాత రైలుకి టికెట్ తీసుకోమని చెప్పాము. అయన చదువుకొన్న వాడు, ఐఐటి అంటే తెలుసు కనుక ఢిల్లీకి ఏదొక టికెటు తీసుకొని ఎక్కితే కష్టమని, అయన ఏదోకటి చుస్తాను వెంటనే బయలుదేరి విజయవాడ రమ్మన్నాడు. నేను హడావుడిగా బయలుదేరి విజయవాడ వెళ్లేసరికి 8:00 అయింది. అయన రైల్వే లో ఎవరో తెలిసిన వాళ్ళను పట్టుకొని వెయిటింగ్ లిస్టు టికెట్ సంపాదించాడు. తనతొ వాల్ల ఇంటికి తీసుకు వెళ్లడు. రైలు GT express రాత్రి 11:00కి, భోజనం చేసి బయలు దేరి రైల్వే స్టేషన్ కి 10:30 కి చేరుకోన్నం, అయన ఎవరో TTEని పట్టుకొని నాకు సీటు ఇప్పించాడు. ఆ TTEకి ఎంత ఇచ్చాడో తెలియదు గాని వాడు వచ్చి ఆ సీటు ఢిల్లీ వరకూ ఇచ్చినట్టుగా చెప్పాడు. ఆనందంగా TTEకి, మా అంకుల్ కి ధన్యవాదాలు చెప్పి వచ్చి పడుకొన్నాను. బాగా అలసి పోవటం వలనా వెంటనే నిద్రాపట్టేసింది.
ఉదయం 7:00కి ఎవరో వచ్చి లేపారు హిందీలో మాటలాడుతున్నారు, వారి బాద అర్ధం అయింది, ఆ సీటు వారిదంట. నేను ఈ సీటు నాకు ఢిల్లీ వరకు TTE ఇచ్చాడని ఇంగ్లీషులో చేప్తున్నాను, వాళ్లకి అర్ధం అవ్వటం లేదు. అంతలో పక్క సీటులో నిద్రా పోతున్న తమిళ్ అతను లేచాడు, ప్రాబ్లమ్ ఏమిటి అంటే చెప్పాను. అతను హిందీలో పెద్దగ వాళ్ళతో ఏదో తిట్టినట్టుగా చెప్పాడు. వాళ్ళు వెళ్లి ఒక గంట తర్వాత వేరే TTEని తీసుకొని వచ్చారు. వాడు వచ్చి నా సీటు వాడికి ఇచ్చేశాడు. నాకు ఏమి చెయ్యాలో తోచలేదు, వాడికి ముందున్న TTE తొ మాట్లాడాలని అడిగాను. వాడు విజయవాడ TTE జొన్ అయిపోయిందని దిగిపోయడని చెప్పాడు. మరి నా సీటు అంటే ఏమి కాళి లేవని వెళ్లి పోయాడు. అప్పటి వరకూ ఎప్పుడూ అంతధూరం ఒంటరిగా వెళ్లలేదు, అందులోనూ నాకు హిందీ రాదు, ఇంతక ముందు ఇంటర్వ్యూకి వెళ్ళిన హిందీ వచ్చిన స్నేహితులు తోడు వున్నారు. ఒక్కడినే అల బిక్కు బిక్కు మంటూ అదే సీటు లో సర్దుకొని కూర్చున్నాను. అధృష్ట వశాత్తు ఆ సీటులో వున్నవాడు రాత్రి 1:00కి గ్వాలియర్ లో దిగిపోయాడు ఆప్పుడు మళ్ళి అక్కడ నిద్రా పోయాను.
ఉదయం 7:00కి దిగి రైల్వే స్టేషన్ లోనే ముకం కడుకొని, తయరై ఐఐటికి చేరుకొనె సరికి 9:00 అయ్యింది. DD కోసం లైన్లో నిలబడి కట్టాను. అది మద్యాహ్నం 1:00 కి ఇచ్చారు. మన ఆంధ్రలో వానలు పడుతున్న ఢిల్లీ లో మాత్రం నడి వేసవి, ఉష్ణోగ్రతలు 50 కి దగ్గరగా వున్నయి. అది తీసుకొని వచ్చేసరికి లంచ్ హవర్ అని 2:00 తర్వాత రమ్మన్నారు, 2:00కి వెళితే సంభందించిన వాళ్ళు 3:00కి వచ్చాడు. వెళ్లి DD ఇస్తే అది కాదు, దానిని బ్యాంకులో కట్టి చలాన తీసుకొని రమ్మన్నాడు. వాడికి ఇంగ్లీష్ రావటం లేదు, నాకు హిందీ రాదు. వాళ్ళు DDనె అడిగారని చెప్పిన వినే పరిస్థితిలో లేడు. వాడితో వాదించి ప్రయోజనం లేదని, హడావుడిగా బ్యాంకుకి వెళ్లి చలాన కట్టి వచ్చే సరికి 5:00 అయ్యింది. చలాన తెచ్చి ఇస్తే దానిని రెండు కాపీలు జిరక్ష్ తీసుకొని రమ్మన్నాడు. జిరక్ష్ తీసుకొని వచ్చి వాడికి ఇచ్చేసరికి 5:30 అయ్యింది వాడు దానిని తీసుకొని లోపల వేసుకొని టైం అయిపోయిందని, ఆకనలేడ్జ్మెంట్ కూడా ఏమి ఇవ్వకుండా పంపించాడు. లక్కీగా తీసుకున్నాడు దానికి సంతోషించాను.
అప్పుడు ఆలోచిస్తే, ఉదయం టిఫెన్ తర్వత ఏమి తినలేదు. రూం తీసుకోలేదు. ఎక్కడ వుండాలో తెలియదు. నేను ఆఫిసియల్ పని మీద రాలేదు, కనుక ఐఐటి లో రూం ఇవ్వరు. తెలిసిన వాళ్ళు లేరు గెష్ట్ ల వుందమంటే. లక్కీగా ఐఐటి లో తెలుగు వాళ్ళు ఎక్కువ వుండటం వలనా ఎవరో తెలుగు వాళ్ళు వెళ్తుంటే, వారి వెనుక వెళ్లి వాళ్ళని పరిచయం చేసుకొని, ఏదో రైల్వే స్టేషన్లో, బస్సు స్టాండులో కొంత మంది పట్టుకొని ఎవరో వాలెట్, లగేజ్ అంత కొట్టేసరని చెప్పినట్టుగా నా దిన గాధ అంత వారికి విన్నవించాను. వాళ్ళు నా బాధను అర్ధం చేసుకోన్నారో లేక ప్రాతియా భావంతోనో వాళ్ళ రూంకి తీసుకేల్లరు, అక్కడ స్థానం చేసి, వల్లే కెంటిన్ కి తీసుకు వెళ్లారు. తిరుగు ప్రయాణం చెయ్యాలి. టికెట్ లేదు. అప్పుడు వెంటనే టికెట్ బుక్ చేయటానికి తత్కాల్ పద్ధతి కూడా లేదు. వాళ్ళ రూంకి వెళ్లి ఇంటర్నెట్ లో తర్వత రైలులు ఏమున్నాయో చూస్తే ఉదయం 5:00 కి స్వర్ణ జయంతి express వుంది. ఆ సమయం కి అక్కడికి చేరాలంటే నడిరాత్రి 3:00 కి బయలు దెరలి. ఆటోలు దొరకాలి, అక్కడికి వెళ్లి టికెట్ తీసుకోవాలి చాల కష్టం.
అప్పటికే 10:00 అయిపొయింది, ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. ఎలా అయితే అల అయిందని 11:00 బయలుదేరి 12:00 కి నిజాముద్దీన్ స్టేషన్ చేరుకొన్నాను. అక్కడ వెయిటింగ్ లిస్టు టికెట్ కూడా దొరకలేదు. కొంచం సేపు మళ్ళి అలోచించి , వెనకకు వెళ్ళిన ఎక్కడ వుండాలో తెలియదు. బయట రూం తీసుకొన్న టిక్కెట్ ఎప్పుడూ దొరుకుతుందో తెలియదు, ఎలా అయితే అల అయిందని జనరల్ టిక్కెట్ తీసుకొన్నను. స్టేషన్ లోకి వెళితే దానికన్నా మన ఆంధ్రాలో ఏ చిన్న స్టేషన్ అయిన నయంగా వుంటాయి అనిపించింది. నాకు కూర్చోవాలని కూడా అనిపించలేదు. ఫ్లాట్ ఫాం నిండా ఎలుకలు తీరుతున్నాయి. ఎక్కడ చుసిన కిల్లిలు ఉసి వున్నాయి. పగలంత అలసి పోయి వుండటం వలనా నిద్రా మున్చుకోచేస్తుంది. అలానే నిద్రని ఆపుకుంటూ ఉదయం 4:30 వరకూ వున్నాను. స్వర్ణ జయంతి express వచ్చి ఫ్లాట్ ఫాం మీద ఆగింది. వెళ్లి జనరల్ భోగీలు చూసాను అంత కాళిగా వున్నాయి, నా ప్రాణం లేచి వచ్చింది. అంత ఉదయం అవ్వటం వలనా ఎవ్వరు లేరు. నా అదృష్టం ఏమిటంటే ఆ రైలులో ఎక్కి పైన పడుకొన్నాను, విజయవాడ వరకూ నన్ను ఎవరు కదపలేదు. అంటే ఆ రైలు జనరల్ భోగీలు అంత కాళిగా వున్నాయన్న మాట. ఆరోజు అంత రైలులో వుండి మర్రోజు మధ్యాహ్నం 12:00కి విజయవాడలో దిగాను.
ఐఐటి ఎడ్మీషన్ లేటరు లేటుగా పంపాడో, పోస్ట్ లో లేటుగా వచిందో తెలియదు కానీ వాడి ఈ చిన్న తప్పిదం నాకు నాలుగు రోజులు నరకం చూపించాయి, అందులో మూడు రోజులు రిజర్వేషన్ లేని రైలు ప్రయాణం ఉహించుకోండి. ఆ తర్వత ఏన్ని సార్లు ఢిల్లీ వెళ్ళిన ఆ ప్రయాణమే మర్చిపోలేని ప్రయాణంగా మిగిలింది. ఇంక ఆ ప్రయాణం లో చాల మర్చిపోలేని విషయాలు వున్నాయి రాస్తూ పోతే వస్తూనే వుంటాయి.

wow!! unforgettable isnt it
ReplyDeletecongrats on becoming an IITian
అయ్యో ఎన్ని కష్టాలు పడ్డారు అండీ! నేను కూడా ఇలాగే ఇంజినీరింగ్ అయిపోయాక ముంబైలో ఇంటర్వ్యూ కోసం చాలా కష్టపడి వెళ్ళాను. కానీ మీరు పడినన్ని కష్టాలు పడలేదు. మీది ఇతరుల తప్పిదం మరియు దురదృష్టం అయితే నాది స్వయంకృతాపరాధం. నేను విజయవాడ ముంబాయిల మధ్య చాలా సార్లు ఇరవై నాలుగు గంటల సేపు జనరల్ లో కూర్చుని ప్రయాణించాను కానీ మీరు ఏకంగా మూడు రోజులు జనరల్ లో ఉన్నారు అంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఆ బాధలు నాకు బాగా తెలుసు కాబట్టి! అది మీ కోసం వేసిన రైలు అనుకుంటాను అందుకే ఎవరూ కదపలేకపోయారు :) . వసతి కోసం ఊరు కాని ఊరు లో ఇబ్బంది పడటం ఎవరికీ రాకూడని కష్టం.కానీ అక్కడ కూడా మీ అదృష్టం మిమ్మల్ని వరించింది. మీరు వ్యవసాయం చేస్తున్నారు అంటే ఓపిక చాలా ఉండి ఉంటుంది. అందుకే ఓర్చుకోగలిగారు. వినే వారికి ఇవి మధుర స్మృతులు అనిపిస్తాయి కానీ అప్పుడు మనం చూసే నరకం,ఈ ఘడియలు ఎప్పుడు ముగుస్తాయో అని బిక్కుబిక్కుమంటూ గడపటం నిజంగా భయంకరం.
ReplyDeleteAll ur posts are very nice.. keep posting..
ReplyDelete