Thursday, 19 June 2014

పరిక్ష డ్రాప్ చెయ్యటం...ఒక గొప్ప..

మా కళాశాలలో ఒక పెద్ద ఆడిటోరియం వుంది, కానీ దానిని రెండుగా చేసి రెండు చిత్ర లేఖన గదులు (డ్రాయింగ్ హాల్) గా మార్చారు, దానినే  పరిక్ష సమయమంలో  పరిక్షల కోసం కుడా వాడే వారు. దానీలోనే మా క్లాసు మొత్తం 60 మంది పరిక్ష రాసే వాళ్ళం. అప్పటిలో పరిక్ష పాస్ అవ్వలేమనో, సరిగా మార్కులు రావని అనిపిస్తే పరిక్ష పేపర్ ఇవ్వంగానే చూసి ఏమి రాయ కుండా పేపర్ ఇచ్చేసి వచ్చేసి గొప్పగా డ్రాప్ చేసామని చెప్పుకొనే వాళ్ళు. నాకు మొదట్లో డ్రాప్ అంటే ఏమిటో తెలిసేది కాదు, ఎలా చేస్తారో కూడా తెలీదు. కొంత మంది మొత్తం రాసి కావాల్సిన మార్కులు రావని అంత కొట్టేసి వచ్చేవారు కుడా! తప్పుతాము అనుకొన్న వాళ్ళుకూడా డ్రాప్ చేసాము అని చెప్పేవాళ్ళు అది ఏదో గొప్పగా. అది తప్పటామే కానీ గొప్పగా డ్రాప్ చేసామని చెప్పేవాళ్ళు.

ఆ రోజు అతి భయంకరమైన సబ్జెక్ట్ ఇంజనీరింగ్ మేటిరియల్స్ మా మొత్తం కోర్సులోనే కష్టమైన సబ్జెక్ట్. ఏ మేటిరియల్ గురించి ఇస్తాడో, దాని కంపోజిషన్ ఏమిటో, దాని ఉపయోగాలు ఏమిటో, దాని స్వభావాలు ఏమిటో ఇలా అంత చిందర వందరగా, అన్ని చదివిన గుర్తు వుంటాయో లేదో, దేనికి ఏవి రాస్తామో, ఆసలు తెలిసినవి ఇస్తాడో లేడో ఇలా అన్ని అనుమానాలతో ఆ రోజు ఉదయం నుంచి మనసు ప్రశాంతం గా లేదు, ఏమి తినాలని కూడా అనిపించలేదు. నేను కాదు అందరి పరిస్థితి అంతే, మద్యాహ్నం రెండిటికి పరిక్ష వెలుతుదారిలో కూడా ఒకోక్కడు అది గుర్తుందా ఇది గుతుందా? అది చెప్పు ఇది చెప్పు అంటూ భయపడుతూ వెళ్ళాము. అది ఆ మే ఎండలో, తినక, భయం తొ నీరసంగా చెమటలు కారుకుంటూ పరిక్ష హాలు లోకి వెళ్ళాము. పైన పంకాలు తిరుగుతున్నచెమటలు లీటర్లు లీటర్లు కారుతూనే వున్నాయి.

పరిక్ష పేపర్లు ఇచ్చారు, చూడగానే ఒక్కొక్కడి గుండెల్లో పెద్ద రాయి పడింది, ఒక్క ప్రశ్న కూడా తెలిసినవి లేవు. తెలిసి తెలియనట్టుగా అదా కాదా అన్నట్టుగా వున్నయి. ఒకరి మొకాలు ఒకరు చుసుకోన్నాము. ఏడుపు ఒక్కటే తక్కువ. తొలి ఇరువై నిముషాలలో క్లాసులో కొంత మంది డ్రాప్ అని లేచి పోయారు. విషయం ఏమిటంటే మా మాస్టారు క్లాసులో చెప్పేవారు. ఆ సబ్జెక్టు తొలి సారి పాస్ కాక పోతే చాల కష్టమని, అప్పటికి మా అన్నయ్యలు మూడేళ్ళ ముందు బ్యాచ్ వాళ్ళు ఇంకా ఆ సబ్జెక్టు అవ్వక కుస్తి పడుతున్నారు అని. నేను ఆలోచనలో పడ్డాను. కళ్ళలో నిరు తిరుగుతుంది. ఏమి చెయ్యాలి డ్రాప్ చెయ్యాల వద్దా అని ఆలోచిస్తున్నాను. అంతలోకి మా మాస్టారు వచ్చి మళ్ళి ముందు చెప్పిన మాట మళ్ళి చెప్పి,  డ్రాప్ చెయ్యవద్దని చెప్పాడు, ఇచ్చినా వాటి గురించి తెలిసినదంత రాయమన్నారు. కానీ మా వాళ్ళు డ్రాప్ చేసి వెళ్తూనే వున్నరు. సగం క్లాసు కాళి అయిపొయింది.

డ్రాప్ చేసిన పెయిల్ అయినట్టే పాసవటనికే కష్ట పడే సబ్జెక్టులో మార్కులు అవసరమా అనుకొని ఎదైతే అది అవుతుందని, రాయటం మొదలు పెట్టాను. మూడు గంటలు అయిపోయే వరకూ ఇచ్చిన వాటి గురించి ఏది తెలిస్తే అది వ్రాస్తూనే వున్నాను. టైం అయిపొయింది. పరిక్షలు అయిపోయాయి. సెలవలకి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే సరికి మార్కులు వచ్చి వున్నాయి, విషయం ఏంటంటే నా సబ్జెక్టుల అన్నింటిలోకి ఆ సబ్జెక్టు మార్కులే ఎక్కువ. ఆ సబ్జెక్టు రాసిన అతి కొద్ది మందిలో నేనే టాపర్ ని. ఆ తర్వాత సప్లి రాసి చాల మందికి ఇంకా మంచి మార్కులు వచ్చాయి అనుకొండి.  నాకు చాల ఇష్టమైన సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వస్తాయి అనుకొంటే ముక్కుతూ మూలుగుతూ పాసయ్యాను. హహ హతవిది. ఆ సంవత్సరం అన్ని సబ్జెక్టులు పాసయిన అతికొద్ది మందిలో నేనొకడిని. సమయానికి మా మాష్టారు నిజంగా దేవుడుల వచ్చి నా చేత పరిక్ష రాసేటట్లు చేశాడు. నేను ఆ తర్వాత ఏప్పుడు ఏ పరిక్ష డ్రాప్ చెయ్యలేదు. 

No comments:

Post a Comment