Saturday 21 June 2014

బడే గుడి

పల్లెటూరులో వుంటే వానకాలంలో చాల చూడొచ్చు, చెయ్యొచ్చు. అది మా ఊరి ప్రభుత్వ పాఠశాలలో అయితే చెప్పలేము, మేము చదువు కన్నా పిల్లల ఆటలు ఎక్కువగా అడేవాళ్ళము. వానలకి మట్టి తడిసి బొమ్మలు చేసుకోటానికి వీలుగా వుండేది. విరామాలలో పిల్లలం అందరం పందేలు పడి ఒకరికన్నా ఒకరు పెద్ద, అందమైన బొమ్మలు చేసే వారము. ఘంట కొట్టంగానే వాటిని దాచి పెట్టి వెళ్ళే వాళ్ళం. మళ్ళి వచ్చే వారకు అవి ఎండి పొయి, విరిగి పోయి, గేదెలు తొక్కేసి, ఏ కుక్కో ఆగం చేసి వుండేవి. అవి వేరే వాళ్ళు ఆగం చేసారని వాళ్ళతో గొడవ పడి, కొట్లాటలు, పంచాయితీలు, చివరగా ఇద్దరికీ దెబ్బలు, ఇవి అన్ని తరచుగా జరుగుతుండేవి.

అప్పుడు నేను నాల్గవ తరగతి చదువు తున్నాను. అప్పట్లో వినాయక చవితికి వినాయకుని విగ్రహం మట్టితో చేసేవారు. మా వూరిలో మూడు బజారుళ్లో మూడు బొమ్మలు వుంచేవారు. మా బజారులో విగ్రహంచేసేటప్పుడు పిల్లలందరం వెళ్లి దాని దగ్గర కూర్చొనిచూస్తూ, అక్కడి మట్టితో మేము చిన్న చిన్న వేరే వేరే బొమ్మలు చేసే వాళ్ళం. ఆ సంవత్సరం గుడి అంత మట్టి మట్టి చేస్తున్నామని మమల్ని అందరిని తిట్టి బయటకి పంపిచేసారు. మాకు కోపం వచ్చి బడిలో అడుకొందామని వెళ్ళాము. ఆ రోజు వాన పడి తడిసి ఉండటం వలనా ఏమి చెయ్యలో తెలియక వరండాలో కూర్చొని, మట్టి తెచ్చి ఏవో బొమ్మలు చెయ్యటం మొదలు పెట్టం. నేను వినాయకుడిని చేద్దామని చేస్తున్నాను, కొంతసేపటికి అందరు వాళ్ళ బొమ్మలు ఆపేసి బాగా చేస్తున్నాని నాకు సహాయం చెయ్యటం మొదలు పెట్టారు. ఒకడు వెళ్లి వినాయకుని కళ్ళుగా పెట్టటానికి గోలీలు తేచ్చాడు, ఇంకొకడు పెద్ద వినాయికుడికి కను బొమ్మలు, నామాలు, కడియాలు, గొలుసులుల అంటిచటానికి వాళ్ళ నాన్న కలర్ పెపర్లు తెచ్చడాని, వెళ్లి తెలియకుండా ఒక్కొక పేపర్ తీసుకొని వచ్చాడు. అందరం కలసి వినయికుడిని చాల బాగా చేసి అలంకరించం.

మా వాడు ఒకడు వెనకకి తిరిగి మాష్టారురో అని అరిసి పరుగు లంకిచుకొన్నాడు, వాడిని చూసి మిగతా అందరు వాడి వెనకాల పరిగెత్తారు. నేను, ఇంకొకడు మిగిలి పోయం, ఇంట్లో నుంచి తెచ్చిన నీల్ల కడవ, కత్తేర ఇవన్ని అక్కడ వుండటం, అవి తీసుకోకుండా వెళితే ఇక్కడ తప్పిన తన్నులు ఇంటి దగ్గర తినాలి అందుకని. ఆయన మా వేనుకే నిలబడి చూస్తున్నాడు. మా విపు మీద దెబ్బ ఎప్పుడూ పడిద్దో అన్న కంగారుగా నిలబడి వున్నాం. ఆయన చిన్నగా బొమ్మ దగ్గరికి వచ్చి బాగా చూసి ఇది ఎవరు చేశారు అని అడిగాడు. చేసినా వాళ్ళని తంతాడు అనుకొని నేను పోయినా వల్లకల్లి చూపించాను. నాతో వున్నవాడు వీడే అని చెప్పాడు. నేను వాడి కల్లి కోపంగా ఒక చూపు చూసాను. వాడికి అప్పుడు అర్ధమై అందరం కలసి చేసామని చెప్పాడు. అయన అలాగే కాసేపు అలోచించి ఇప్పుడు దిన్ని ఏమి చేస్తారు అని అడిగాడు. మా వాడు పారేస్తాం అని చెప్పాడు, నేను ఇంటికి తిసుకేలతనని చెప్పాను. మాస్టారు ఏదో అలోచించి అయిపోయింద ఇంకా ఏమైనా చెయ్యల అని అడిగాడు. నేను అయిపోయిందని చెప్పాను. 

బడి  ఒక గది తలుపులు తిసి "లోపల పెట్టండి, రేపు ఉదయం పత్రి తీసుకొని రండి. మనం పూజ చేద్దాం" అని చెప్పాడు. సరే అని తలూపి లోపల పెట్టి మా సామాను తీసుకొని బయలు దేరుతుంటే, "రేపు పిల్లలందరికి చెప్పి తీసుకురండి" అని మళ్ళి చెప్పాడు. అయన ఇల్లు బడికి దగ్గరగానే వుంటుంది, వాళ్ళ ఆవిడని అందరం పిన్ని అనే వాళ్ళం. ఆ మరునాడు ఉదయాన్నే పత్రి తీసుకొని వెళ్ళాం. మష్టారు చెప్తుంటే మేము విగ్రహాన్ని టేబులు మీద పెట్టి, అప్పుడు బడిలో కుర్చోటానికి బారు పీటలు వుండేవి, వాటిని ఒక మండపం లాగా ఒకదానిమీద ఒకటి వేసి తయరు చేసాము. వెళ్లి ఇంట్లో పూజలు చేసుకొని రమ్మని చెప్పాడు. మేము వెళ్లి వచ్చేసరికి పిన్ని పాయసం చేసి తీసుకు వచ్చింది. కొంచం సేపటిలో మావూరి పూజారి, ఉళ్ళో ఉండే మరో ఇద్దరు మస్టారులు వచ్చారు. పూజ చేసి ప్రసాదం పెట్టారు. పెద్ద పిల్లలు అంటే మాకన్నా సీనియర్స్  పక్క ఉరిలో (మా వూరిలో ఐదవ తరగతి వరకే వుంది) చదువుతుంటారు అందరు వచ్చి చూసి, సాయత్రం ఉరేగిద్దాం అని పధకం వేశారు. 

వాళ్లంత  బాగా ఆలోచించి మా వురి రైస్ మిల్లులో లాగుడు బండి వుండేది, దాన్ని మీద వురేగిద్దాం అని మాష్టారుతో మాట్లాడి ఆయనను ఒప్పించారు. వాళ్ళు వెళ్లి ఆ బండిని, పక్క టౌనుకి వెళ్లి రంగు కాగితాలు తెచ్చారు. ఆ బండిని బాగా అలంకరించి దానిలో ఆ సాయంత్రం వురేగింపు మొదలు పెట్టాము. విషయం ఎంటంటే ఏ బజారు పిల్లలు ఆ బజారు వినాయకుడి వెంట తిరిగేవారు అప్పటి వరకూ. ఇది బడిలో చేసినా వినాయకుడు కనుక పిల్లలందరూ మైకులు పెట్టె పని లేకుండా పెద్ద పెద్దగ స్లోగన్స్ చేశారు. అందరు బియ్యం ఇవ్వటం, కొబ్బరికాయలు కొట్టటం, వారు పోయటం చేశారు. మేము తీరిగి బడి చేరుకొనే వరకూ ఆ బండి బియ్యం, కొబ్బరి చిప్పలతో నిండి పోయింది. అవి అన్ని బడిలో సర్ది వెల్లిపోయాము. తరువాత రోజు బడికి వెళితే మాష్టారు బడికి సెలవు ఇచ్చి మాష్టారులు అందరు మాతో పాటు నిమర్జననికి నదికి వచ్చారు. వెళ్లేసరికి మాష్టారు మనుషులని పెట్టి వచ్చిన బియ్యతో పులిహోర చేయించాడు. అది పిల్లలందరం బాదం ఆకులలో పెట్టుకొని బోజనాలు తిన్నట్టు తిన్నాం. మాకు ఆ ముందు రోజు వచ్చిన కానుకలు అన్నీ మాష్టారు కి ఇచ్చాము. మిగతా మాష్టారులు కూడా మాష్టారుకి ఇంకా డబ్బులు ఇచ్చారు అవి అన్ని చేయించినందుకు. మాష్టారు ముందు నిరాకరించారు, మిగతా మాష్టారులు మా దగ్గర వున్న కానుకల డబ్బులు కూడా తీసుకొని ఆయనకి ఇచ్చారు.

ఆ తర్వత సంవత్సరం నుంచి పిల్లలం ఉరిలో చందాలు వసులుచేసి చెయ్యటం మొదలు పెట్టాము, నేను వరుసగా ఐదు సంవత్సరాలు వినాయకుడి బొమ్మను చేశాను. తర్వాత నేను ఊరు నుంచి బయటకి వచ్చను, మాష్టారు కూడా అదే సంవత్సరం బదిలీ అయింది. ఇప్పటికి అలానే బడిలోనే  వినాయక చవితి చేస్తున్నారు, మా బజారులో వినాయకుని పెట్టటం మానేసి బడిలో వినాయకునికి చందాలు ఇస్తున్నారు. ఈ పెద్దోలందరూ పిల్లల వినాయకుడిని వాళ్ళ వినాయకుడిని చేసుకోన్నారు. ఇప్పుడు విగ్రహాలు చెయ్యటం లేదు కొనుకోస్తున్నారు. బడికి ఇంకా రెండు రోజులు సెలవలు ఇస్తున్నారు. అప్పుడు ఒక్క అడుగు ఎత్తున్న విగ్రహం చేస్తే ఇప్పుడూ 15 అడుగుల విగ్రహం కొనుకోస్తున్నారు. 

అప్పటినుంచి అల మా బడి గుడిల మారింది . ఒక విధంగా నేను మొదలుపెట్టినది అని అనందంగా వున్న పిల్లల నుండి పెద్ద వాళ్ళు లాగేసుకున్నారు అని బాధగా కూడా అనిపిస్తుంది.

Friday 20 June 2014

కొత్త కేంద్రియ విశ్వవిద్యాలయాలు

మన మంత్రులు రాష్ట్రంలో వచ్చే కేంద్రియ విశ్వవిద్యాలయాలన్నీ వాళ్ళే తెస్తున్నట్టు చంకలు గుద్దుకున్టున్నారు. కానీ అవి సామన్యులకి ఏ విధంగా ఉపయోగపడవాని ప్రజలకు తేలిక వాళ్ళ పిల్లలందరూ వాటిలో చదివేస్తారు అనుకొంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చే విశ్వవిద్యాలయాలలో NIT కాకుండా మిగతా వేటిలో మన రాష్ట్రంకూ ప్రత్యెక ప్రవేశం ఉండదు. వీటిలో అన్ని దేశం స్థాయిలోనె విద్యార్దులను ఏంపిక చేసి తీసుకొంటారు. ఇవి ఇక్కడ పెట్టినా పక్క రాష్ట్రములో పెట్టినా పెద్ద తేడా ఏమి వుండదు. ఇప్పుడు వీటి వలనా తక్షనం రాష్ట్రానికి ఒరిగేది ఏమి లేదు, కాక పోతే మన వాళ్ళకి వీటి అన్నింటి మీద అవగాహనాన రావటం వలనా భవిషత్తులో వాళ్లకి వున్న వివిధ అవకాశాలు తెలుస్తాయి. అంతే తప్ప పైన చెప్పేవి ఏవి ఉపాది కల్పించేవి ఏవి లేవు. ఇప్పుడు ఇలాంటి అన్ని కేంద్రియ విశ్వవిద్యాలయాలలో చిన్నగ్రేడు ఉద్యోగులను అందరిని కాంట్రాక్టు పద్దతిలోనే నియమిస్తున్నారు మరియు దేశం మొత్తం నుండి ఎంపిక జరుగుతుంది.  అన్ని కలిపి చాల తక్కువ మందికి ఉపాది కల్పిస్తాయి. 

ముందుగానే NDA అజెండాలో ప్రతీ రాష్ట్రానికి IIT, IIM, AIIMS వున్నయి. ఇప్పటికే మన వాళ్లకి వీటి మీద మంచి అవగాహనే వుంది. ముందున్న ప్రభుత్వం ప్రతీ రాష్ట్రానికి ఒక NIT కూడా ఇచ్చింది.  ముందున్న ప్రభుత్వం 54 కేంద్రియ విశ్వవిద్యాలయాలకూ అనుమతి ఇచ్చింది. అందులో మన రాష్ట్రానికి పది (ఏడు తెలంగాణ + మూడు ఆంధ్రాకు) ఇచ్చింది, ఉన్నవి మూడు కలిపి మొత్తం పది తెలంగాణకి వున్నాయి. అంటే విడి పోవటం వలనా మనకి ప్రతేకంగా వచ్చేవి నాలుగు చిన్నవిశ్వవిద్యాలయాలే. AIIMS వంటి ఆసుపత్రిలో ఒక చిన్న ఆపరేషన్ చేయించుకోవాలంటే సామన్యులు కొన్ని నెలలు వేచి చూడాలి. మన రాష్ట్ర విద్య, వైద్య, ఉపాది రంగాలకు ఇప్పటికిఇప్పుడు ఇవి ఏ విధంగాను ఉపయోగ పడవు. 

మన మంత్రులు ఈ మాటలు పక్కన పెట్టి మన రాష్ట్రానికి వారు ఏమి చేయబోతున్నారో చెప్తే బాగుంటుంది.  అంటే రాష్ట్రం స్థాయిలో విశ్వవిద్యాలయాలు, కాలేజిలు, ఆసుపత్రులు, పరిశ్రమలు ఎలా అభివృద్ధి చేస్తారో చెప్తే బాగుంటుంది.

ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవాటం - ఉపయోగాలు

నేను నా స్నేహితులను ఎంతో మందిని చూసాను, చాల మంది ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవటానికి ఇష్ట పడటం లేదు. వాళ్ళకి ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే ఏదో అన్యోన్నత బావన, మాట వినరనే బావన. దానికి వారు చెప్పే సాకే ఇల్లు చూసుకోవాలని, పిల్లలను చూసుకోవాలని, తల్లి తండ్రులను చూసుకోవాలని, వారి సంపాదన బ్రతకటం ఎందుకని ఇలా ఎన్నెన్నో సాకులు. దేనికైనా లాభాలు నష్టాలు వుంటాయి, అలానే కొన్ని కావాలి అంటే కొన్ని వదులు కోవాలి. బార్య ఉద్యోగం చేయటం వలనా నష్టాలు లేవని చెప్పాను, కానీ నా అభిప్రాయం ఏమిటంటే ఎవరైనా చదువు కొన్న తర్వాత దానిని ఉపయోగించుకోవాలి. అమ్మాయి, అబ్బాయి ఇద్దరికీ ఇంటి దగ్గర బాగా చదుకోమ్మనే చెబుతారు. అలానే చాల మంది అమ్మాయిలు చాల కష్టపడి అబ్బాయిలతో పోటిగా చదువుతారు. చదువు లోకజ్ఞానం కొరకే అయితే వారికి ఏదొక బ్యాచలర్ డిగ్రీ చదివితే సరిపోతుంది. ఇంగినీరింగ్, డాక్టర్, CA, MBAలు ఎందుకు? అంత మంచి కోర్సులు చదివి మన గవర్నమెంటు డబ్బూ, మన డబ్బూ వృదా చేసుకోవటం ఎందుకు? అంత చదివిన వారిని ఇంట్లో కూర్చో పెట్టి వంట, ఏడుపు సీరియల్స్ కి బలి చెయ్యటం ఎందుకు?

నాకు ఇద్దరు స్నేహితులు వున్నారు. వారు ఈ కోవకే చెందుతారు. ఇద్దరు మెట్రోపోలిటన్ సిటిలలో వుంటున్న ఇద్దరిది ఇదే వాదం నన్ను ఒప్పించాలనె చూస్తారు కానీ వాళ్ళు ఒప్పుకోనెవారు కాదు. ఇద్దరికీ బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత ఇద్దరు ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలను పెళ్లి చేసుకోన్నారు. వారి దగ్గరనుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ని బట్టి నా ఆలోచనలు సరియినవే అని, నేను చెప్పిన ఉదాహరణలు సరి అయినవేనని, ఇంకా ఎవరికైనా ఉపయోగా పడతాయని రాస్తున్నాను. ఈ మద్యనె చేతన్ భగత్ కూడా Home truths on career wives అని ఆర్టికల్ రాసాడు. అది చదివా కానీ గుర్తు లేదు! అప్పుడు house wives దాని మీద చాల విమర్శలు కూడా చేశారు. నేను కొంత మందిని చూసి ఏర్పరచు కొన్ననా సొంత అభిప్రాయాలు. ఇంకా ఏమైనా వుంటే చెప్పండి, కలుపుతాను, విమర్శలు కూడా చెప్పండి కానీ "ఎవరివో తేలియదు కనుక బ్రతికి పోయావు దొరికితే ఇరగతీస్తా" అనే రేంజ్ లో వద్దు. 

ఉద్యోగం చేస్తున్నబార్య అనగానే మొదటి గా అందరికి గుర్తు వచ్చేది ఆర్దిక బలం, అది కచ్చితంగా మచిదే కానీ దాని కోసమే ఉద్యోగం చెయ్యాలన్నదికాదు, దీని కన్నా చాల ఉపయోగాకరమైన విషయాలు చాల వున్నాయి. కానీ నేను career wives గురించి మాట్లాడటం లేదు, employed wives గురించి చేప్తున్నాను.

ముందుగా ఇంటి దగ్గర వుండే గృహిణిలానే తీసుకోండి. ఈ రోజులలో ఆమె ప్రపంచం మొత్తం భర్త, ఫోను, టీవీ, ఇంకా ముందు కెలితే అంతర్జాలం లేక చుట్టూ పక్కల వాళ్ళు. మెట్రోనగరాలలో ఆఫీసు నుండి ఎంత త్వరగా బయలు దేరిన ఇల్లు చేరే వరకూ ఎనిమిది అవుతుంది. ఉదయం నుండి ఇంటిపట్టున ఒంటరిగా వుండటం వలనా మాట్లాడటానికి అన్ని పంచుకోవటానికి దొరికే ఒకే ఒక మనిషి మీరు. మీతొ అల కొంచం ప్రశాంతంగా గడపాలని, కొంచం అల చల్లగాలికి తిరగాలని, చాల విషయలు పంచుకోవాలని వుంటుంది. అది అక్షర సత్యం. కొంత మంది మిరు కష్టపడి వచ్చారని గుర్తించి వాళ్ళ అశలని చంపుకుంటారు లేదా ఏ కూరగాయాల పేరుతోనో మిమ్మల్ని బయటకి తీసుకు వెళ్తారు, వారు చెప్పేవి వినే ఓపిక లేక పోయినా కష్టపడి వినవలసి వస్తుంది. అదే వారాంతాలలో వారు అడిగో లేక మీకు మీరుగా రియలైజ్ అయి బయటికి (పిక్నిక్అనో సినిమానో షాపింగ్ కొ) తీసుకు వెళ్ళాలి.

ఈ షెడ్యులుని గమనిస్తే వారంలో మీకూ ఏ రోజు సెలవు వుండదు. ఏదో హబిని చేయ్యలనుకోవటం లేక ప్రశాంతంగా విశ్రంతి తీసుకోవటం ఇలాంటివి చాల కష్టం. ఇవ్వన్ని మీరు చేస్తున్న మీ కోసం ఎంతో కొంత వాళ్ళు త్యాగం చేస్తున్నరాని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏది కోనలన్న మీమ్మల్ని తోడుగా తిసుకేల్లలని అనుకొంటారు, ప్రతీ దానికి మీ అంగీకారం ఆవసరం అవుతుంది, సొంతగా నిర్ణయాలు తీసుకోలేరు. మీ ఆదాయం మీద కచ్చితమైన అవగాహనా లేక మరి చౌక వాటినో లేక గిరాకీవో ఎంచుకొంటారు. చెప్పాలంటే వాళ్ళు వారి అస్థిత్వంని కోల్పోతారు.

ఉద్యోగం చేసే వల్లనే చూస్తే వారి సంపాదన పక్కన పెటితే, వాళ్ళకి లోకజ్ఞానం పెరుగుతుంది. లోకం పోకడ తెలుస్తుంది. ఆఫీసులో పని చేసి రావటం వలనా ఇద్దరు అలసి పోయి రావటం వలనా హాయిగా తిని నిద్రపోవచ్చు. ఇద్దరి టైం టేబుల్ ఒకటే కనుక, ఇద్దరు ఇంటి బయట చాల సమయం గడపటం వలనా వారాంతాలలో బయటకి పోవాలసిన ఆవసరం వుండదు. ఎదైన కారణాల వలనా కొన్ని రోజులకి బయటకి వెళ్ళిన సర్దుబాటు చేసుకోగాల సమర్దత ఏర్పడుతుంది. ఆఫీసులో కూడా చాల మంది స్నేహితులు వుండటం వలనా మీ నుంచి ఎక్కువ సమయం గడపాలని గాని, ఎక్కువ అంచనాలు కానీ వుండవు. ఆఫీసు విషయాలు, ఓవర్ టైం పని, రాజాకియలు, డెడ్ లైన్లు అన్ని తెలిసి వుంటాయి, కనుక మిమ్మల్ని ఇంక ఎక్కువగా అర్థం చేసుకోగలరు. మీ ఆఫీసు గురించిన అనేక విషయాలు పంచుకో గలగటం వలనా ఇద్దరికీ ఒకరికి ఒకరు సలహాలు ఇచ్చుకోగలరు. కొన్ని విషయాలు అర్థం చేసుకోగల మన వాళ్ళతో షేర్ చేసుకోవటం వలనా చాల ప్రశాంతంగా వుండోచ్చు.  

ఇద్దరు ఆఫీసుకి వెళ్లి వచ్చేటప్పుడు బయట పనులు, ఇంటికి అవసరమైన వస్తువులు తెచ్చికోవటం వలనా చాల సమయం ఆదా అవుతుంది. బయట అంత తెలిసి వుండటం వలనా చిన్న చిన్న పనులు వారికీ వారుగా చూసుకోగలరు. సంపాదన వుండటం వలన వారికి అవసరమైనవి వారు కొనుక్కోగలరు, ఆర్దిక స్వలంభాన వుంటుంది. ఒక్కరే అయితే ఏం తిందాములే అనుకొంటాం, ఏ టీవీ సీరియలో చూస్తానో, పుస్తకం చడువుతనో తిన్నామని అనిపించుకుంటం. చాల మందికి ఒంటరిగా తినటం ఇష్టం వుండదు, కలసి మాటలడుకుంటు తింటే ఎక్కువ తింటం, అనందంగా తింటం. ఉద్యోగం చెయ్యటం వలనా ప్రదేశం మారటం, వేరే వేరే వారితో మాట్లాడం వలన దీర్గఆలోచనలు ఉండవు, అందువలనా మానసిసంగా కూడారోగ్యంగా వుంటారు.

ఇంటి బాద్యతలు అంటే పిల్లలు, ఇతరత్రా పెరిగినప్పుడు వారే ఉద్యోగం చెయ్యల వద్ద అని నిర్ణయించుకోగలరు. ఉద్యోగం చేస్తున్నఅమ్మాయిలకి సంఘంలో కూడా చాల ఆదరణ వుంటుంది. అది మన అమ్మాయిలను చూస్తే రెండు రకాలు వుంటారు, ఏదోకటి చెయ్యాలని కష్టపడి చదివే వాళ్ళు, తెలివి వున్న చదివి ఏమిచేయ్యాలని చదవని వాళ్ళు. ఈ రెండు రకాలు వాళ్ళు మన సంఘంని చూసి ప్రభావితం అయిన వాళ్ళే. ఉద్యోగం చేస్తున్నఅమ్మాయిల పట్ల అబ్బాయిలకి తెలీకుండానే గౌరవం కలుగుతుంది, చెయ్యని వాళ్ళ మీద జాలి వేస్తుంది, ఒకరి కోసం వారి జీవితం నాలుగు గోడలకే అంకితం చేసారని. మన పిల్లలకి (అబ్బాయిలకి) అమ్మాయిలంటే గౌరవం కలగాలన్న, అమ్మాయిలకి చాదువులేన్దుకనే భావన మారాలన్న, అమ్మాయిలు కష్టపడి చదవాలన్న వారి తల్లి ఉద్యోగం చేయటం చాల ఆవసరం. ఇంట్లో తల్లితండ్రులు వున్నా వారికీ ఉద్యోగం చేసే కోడలంటే గౌరవం వుంటుంది, అత్త కోడలు ఎక్కువ సేపు కలసి వుండరు, వర్క్ చేయటం వలనా అలసి పోవటం వలనా గొడవ పడే ఓపిక వుండదు కనుక చాల వరకూ అత్త కోడల్ల గొడవలు వుండవు!

చివరిగా ఏమైనా అనుకొని సంఘటనలు జరిగి మీకూ ఏమైనా అయితే ఆమెను పోషించుకోగాల, ఉన్న ఆస్తులను కాపాడుకోగల సామర్ద్యం, శక్తి వుంటుంది. ఇది ఎందుకు చేప్తున్నాను అంటే నా స్నేహితునికి చిన్నప్పుడే ఉద్యోగం చేసే నాన్న ప్రమాదంలో చని పోయాడు, అప్పుడు వాళ్ళంతా వచ్చి వ్యవసాయం చేసే వాళ్ళ మామయ్య దగ్గర వున్నరు. అప్పటి ఆలోచనలు, ప్రేమలు, బాద్యతాలు వేరు, గవర్నమెంటు స్కూలులలో చదువులు కాబట్టి పెద్ద ప్రాబ్లం కాలేదు, కానీ ఈ రోజుల్లో అలాంటివి చాల వరకూ అసాధ్యమనే చెప్పాలి.

నేను చెప్పేదేంటంటే చిన్నదో పెద్దదో మీ సంపాదనలో పదోవంతైన సరే కాలిగా వుండకుండా ఏదోక ఉద్యోగం అమ్మాయిలు విలైనంత వరుకు చెయ్యాలి. తప్పనప్పుడు కొంతకాలమైన చేసి అవసరమైనప్పుడు మానెయ్యాలి.
ఇప్పటి వరకూ ఉపయోగాలే చెప్పను, ఇప్పుడు నష్టాలు, ప్రతిరోజు పంచాభాక్ష్య పరమానాలుతొ తినలేరు, చాల సార్లు బయట తినవలసి వస్తుంది. మగ ఇగో పక్కన పెట్టి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పనులు, పిల్లల బాద్యత షేర్ చేసుకోవలిసి వస్తుంది. ఇలా చేయంటం వలన ఆడ వారి కష్టాలు కూడా తెలుస్తాయి. ఇంక కొన్ని రేర్ కేసులు వున్నయి అవి ఇక్కడ ప్రస్తావించాను ఎందుకంటే ఇది నేను లాభాలు చెప్పటానికే వ్రాస్తున్నాను. 

గుండమ్మ  కథలో రమణ రెడ్డి "మా ఇంటి పక్కన గోవిందయ్య కోడలు BA పాసయింది, చెప్పిన మాట వినదు" అంటే NTR "మవురులో మున్సుబు గారి కోడలు ఓనమాలు రాని మొద్దు, మొగుడిని, అత్తని, మామని చీపురు కట్ట తిరగేసి దుమ్ము దులుపుతుంది" అని అంటాడు. అది చదువు, ఇది ఉద్యోగం. అర్దం చేసుసుకొనే మనసు కావలి కానీ చదువులు, ఉద్యోగాలు మనుషులని మార్చావు.

మీ
సత్భోగి
13th June 2014

Thursday 19 June 2014

మన కొత్త రాజధాని ఎక్కడ వుండాలి - ఎలా వుండాలి

 ఈ మద్య బాగా వార్తలలో వేడెక్కిన విషయం మన కొత్త రాష్ట్ర రాజధాని ఎక్కడ వుండాలి? ఎలా వుండాలి? అనే విషయం. మన దూరదర్శన్ (న్యూస్ చానల్స్) మరియు అంతర్జాలం లోనూ అతిగా కనిపిస్తున్న విషయం ఇది. మనకి ఇప్పుడు అతర్జాతియ నగరం కన్నా అంతర్జాతీయ రాష్టం కావలి. అర్ధశతాబ్దం ఎంతో కష్టపడి నిర్మించుకున్న హైదరాబాద్ నగరం మన చేతుల నుంచి పోయింది. గతం గతః అని వదిలి వేస్తే, ఇప్పుడు మనం అలోచిన్చాలిసింది కొత్త రాజధాని ఎక్కడ నిర్మించాలి అనే దాని గురించి. కానీ మన గతం నుంచి నేర్చుకున్న పాఠం ఏమిటంటే కేంద్రికృతా అభివృద్ది వలెన లాభలు కంటే నస్టాలే ఎక్కువగా కానిపిస్తున్నాయి. రోజు రోజుకి మెట్రోపలిటన్ నగరాలూ సామాన్య జనజీవనానికి, ప్రభుత్వా కార్యకలాపాలకు చాల అసౌకర్యాలనూ కలిగిస్తున్నాయి. కావున రాజధాని అన్ని విదాల అభివృద్ధి చేయాలను కోవటం అనవసరం. రాజధాని ప్రభుత్వా కార్యకలాపాలకే నిలయం కావలి కానీ, అన్నింటికి అదే నిలయం కాకూడదు. మన గత రాజదానినే తీసుకొంటే అన్ని జాతీయ సంస్థలు, పోలీసు, మిలటరీ, రాజధాని, విద్యాసంస్థలు, ఉద్యోగాలు అవకాశాలు అన్ని అక్కడే వున్నాయి. అందువలన అక్కడ విద్యకానీ, రవాణకానీ, నిత్యావసరాలు కానీ చాల వ్యాయప్రయాసలతో నిండినవి.

ప్రస్తుత సంవత్సర కాలుష్య సంచిని గమనిస్తే మన అన్ని మెట్రోపలిటన్ నగరాలు వున్నాయి, ఈ మద్య ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన వార్త ఏమిటంటే మన దేశా రాజధాని అయిన డిల్లి కాలుష్యంలో ప్రపంచం లోనే మొదటి స్థానంలో వుంది. హైదరాబాద్ బెంగలూరు కన్నా ముందు వుంది, విశాకపట్టణం హైదరాబాదుతొ సమానంగా వుంది. విజయవాడ వీటి తర్వాత కొన్ని స్థానల వెనుక వుంది. మరి కొన్ని రోజులలో అక్షిజెన్ కొనుక్కొనే పరిస్థితి వస్తుంది మెట్రోపలిటన్ నగరాలలో. ఇప్పుడు మన కొత్త రాష్ట్రంలో అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ చాల అవసరం. రాజధాని ప్రభుత్వా కార్యకలాపాలకే తప్ప, అభివృద్ధికి నెలవు కాకూడదు. ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయినా బాద వున్నా అన్ని శుభ సూచికలే కానిపిస్తున్నాయి. మన అదృష్టం కొద్ది అభివృద్దే ధ్యేయంగా సాగే ముక్యమంత్రి, అయనకి అనువైన కేంద్రప్రభుత్వం, రెండు చోట్ల దృడమైన ప్రభుత్వాలు, మన రాష్ట్రానికి రెండు కేంద్ర మంత్రి పదవులు, పెట్టుబడులు పెడుతమంటున్న పెట్టుబడి దారులు, ఇలా ఎన్నెన్నో అనుకుల విషయాలు.

చాల మంది కండిచే విషయం ఏమిటంటే రాష్ట్రరాజధాని రాష్ట్రం మధ్యలోనే వుండాలనే విషయం. మన జిల్లాల దగ్గర నుంచి రాష్ట్ర, దేశ, విదేశ రాజదాణుల వరకూ ఎక్కువ శాతం ఒక పక్కన వున్నాయి. అందు వలనా మనం ఏదో ఒక పక్కన పెట్టు కోవలిసిన ఆవసరం లేదు. మన దేశంనే తీసుకోండి డిల్లి లో వుంది. రుచి చూడని మావిడి పుల్లన అని. మనమేక్కడో వుండి, డిల్లికి దగ్గరగా వుండే రాష్ట్రల ఉపయోగాలు ప్రయోజనాలను గుర్తించలేక పోతున్నారు. ఈ మద్య మద్యప్రదేశ్ లోని రైతులు గ్వాలియర్ నుంచి డిల్లిలో వాళ్ళ నిరసన తెలపటానికి బయలుదేరారని తెలిసిన వెంటనే వారితో చర్చలు జరిపి వెనుకకు పంపింది ప్రభుత్వం. డిల్లి నుంచి గ్వాలియర్కి ఐదు గంటల ప్రయాణం. మనకు ఒకరోజు ప్రయాణం అదే కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలకి రెండు రోజుల ప్రయాణం. వారు ఒక వేళ బయలు దేరారని తెలిసిన ప్రభుత్వం దగ్గర రెండు రోజుల సమయం వుంటుంది. దక్షిణభారతం మీద చిన్న చూపు అనే విషయం అందు వలెనే వచిందేమో? మన జిల్లాకేంద్రాలనే తీసుకోండి మనకు చాల తక్కువ అవసరాలు వుంటాయి. నా చిన్నప్పుడు బస్సు పాస్ రెన్యువల్ చేసుకోవటానికి, నెలకి ఒక రోజు స్కూలుకి సెలవు పెట్టి మరి వెల్ల వలసి వచ్చేది, అదే మద్యలో వుంటే నాకు సెలవు పెట్టవలసిన ఆవసరం వుండేది కాదు.

దీనినుంచి గ్రహించాల్సిన విషయం ఏమిటంటే రాష్ట్రరాజధాని దూరమైయ్యే కొద్ది కొన్ని జిల్లాలు తెలియని నష్టాలకి గురవుతాయి.  కనుక రాష్ట్రరాజధాని రాష్ట్రం మధ్యలోనే వుండాలనే విషయం మనం గ్రహించాలి. కానీ అది అన్ని విదాలుగా అభివృద్ది చెందాలనే ఆవసరం లేదు. మళ్ళి డిల్లినే తీసుకోండి. అది మన దేశరాజధానే కానీ, అన్ని రంగలలో అగ్రగామి కాదు. బొంబాయి ఆర్ధిక పరంగా, బెంగలూరు ఐటి రంగం లోనూ, చెన్నయ్ బ్యాంకింగ్ లోనూ, కలకత్తా ఎగుమతి/దిగుమతికి ఇంక ఎన్నో నాగరాలు వాటి వాటి ప్రత్యేకతలను బట్టి అగ్రగాములుగా నిలిచాయి. కానీ ఇవన్ని ఆ రాష్ట్రల రాజదాణులు అవటం వలనా అస్తఃవ్యస్తంగా తాయరయ్యాయి. గుజరాత్ రాష్ట్రాన్ని తీసుకొంటే హైదరాబాద్ లాంటి సిటీ లేక పోయినా దేశంలో ముందంజలో వుంది. మన దేశంలో ప్రదానంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ మహానగరాలు వెటికి ఒక ప్రణాళిక లేదు, మన నాయకులకి ఒక విజన్ లేదు. నా ఐదు సంవత్సరాలు నేను ఎలా కోలా నెట్టు కొచ్చి, అంత బాగుంటే మళ్ళి ఇంకో ఐదు సంవత్సరాలు పాలించటానికి ఏవో తాయిలాలు ఇచ్చి గెలుద్దమనే కానీ, ప్రజలనూ బాగాస్వములను చేసి వారికీ అర్థం అయ్యేలా చెప్పి ఒక ప్రణాళిక ప్రకారమ్, ఒక వేల ప్రతిపక్షాలు వచ్చిన వాటితో ఆ విజన్ ని ఎలా చేరుకోవలనేది ఎవరు ఆలోచించటం లేదు. రాజకీయాలు వదిలేద్దాం! రాజధానికి వద్దాం!

కనుక రాజధానికి అంతర్జాతీయ విమనశ్రయలు కానీ, అంతర్జాతీయ నగరాలు కానీ ఆవసరం లేదు కానీ అందరికి అందుబాటులో వుండాలి. దీనిని పరిగణలోకి తీసుకొని మన ముక్యమంత్రి గారు అనుకొంటున్న రాజధాని నగరం బౌగోలికంగా మద్యలోనే వున్నది కనుక దీనిని మనం రాజదానిగా అంగికరించ వచ్చును. కానీ అయన అంటున్న అన్ని అభివృద్ది కార్యక్రమాలు అనగా ఐటి హబ్ లు, SEZలు, ఇతర పరిశ్రమలు లాంటివి ఇక్కడే నెలకొల్పాలను కోవటం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడూ అనుకొంటున్న ప్రాంతంలోని భు విలువలు రాష్ట్రం ప్రకటించక ముందే ఆకాశాన్ని తాకుతున్నాయి. అది కాక ఈ జిల్లాలు వ్యవసాయ పరంగా చాల ముందు వున్నాయి.  ఈ ప్రాంతంలో రాజధాని వరకూ సరే గాని మెట్రోపోలిటన్ నగరాలకూ దీటుగా చెయ్యాలనే కోరికతో బంగారం పండించే భూమిని అభివృద్దిపేరుతో నాశనం చెయ్యొద్దని నా మనవి. మాకు ఒక మెట్రోపలిటన్ నగరం కన్నా అన్ని జిల్లాలు ఏదో ఒక రంగంలో ముందుకు వెళ్తూ, రెండవ తరగతి నగరాలుగా వున్న, మొత్తంగా రాష్ట్రం ముందంజలో వుండాలని కోరుకుంటూ సెలవు తీసుకొంటున్నాను.

మీ
సత్భోగి
13th June 2014

పరిక్ష డ్రాప్ చెయ్యటం...ఒక గొప్ప..

మా కళాశాలలో ఒక పెద్ద ఆడిటోరియం వుంది, కానీ దానిని రెండుగా చేసి రెండు చిత్ర లేఖన గదులు (డ్రాయింగ్ హాల్) గా మార్చారు, దానినే  పరిక్ష సమయమంలో  పరిక్షల కోసం కుడా వాడే వారు. దానీలోనే మా క్లాసు మొత్తం 60 మంది పరిక్ష రాసే వాళ్ళం. అప్పటిలో పరిక్ష పాస్ అవ్వలేమనో, సరిగా మార్కులు రావని అనిపిస్తే పరిక్ష పేపర్ ఇవ్వంగానే చూసి ఏమి రాయ కుండా పేపర్ ఇచ్చేసి వచ్చేసి గొప్పగా డ్రాప్ చేసామని చెప్పుకొనే వాళ్ళు. నాకు మొదట్లో డ్రాప్ అంటే ఏమిటో తెలిసేది కాదు, ఎలా చేస్తారో కూడా తెలీదు. కొంత మంది మొత్తం రాసి కావాల్సిన మార్కులు రావని అంత కొట్టేసి వచ్చేవారు కుడా! తప్పుతాము అనుకొన్న వాళ్ళుకూడా డ్రాప్ చేసాము అని చెప్పేవాళ్ళు అది ఏదో గొప్పగా. అది తప్పటామే కానీ గొప్పగా డ్రాప్ చేసామని చెప్పేవాళ్ళు.

ఆ రోజు అతి భయంకరమైన సబ్జెక్ట్ ఇంజనీరింగ్ మేటిరియల్స్ మా మొత్తం కోర్సులోనే కష్టమైన సబ్జెక్ట్. ఏ మేటిరియల్ గురించి ఇస్తాడో, దాని కంపోజిషన్ ఏమిటో, దాని ఉపయోగాలు ఏమిటో, దాని స్వభావాలు ఏమిటో ఇలా అంత చిందర వందరగా, అన్ని చదివిన గుర్తు వుంటాయో లేదో, దేనికి ఏవి రాస్తామో, ఆసలు తెలిసినవి ఇస్తాడో లేడో ఇలా అన్ని అనుమానాలతో ఆ రోజు ఉదయం నుంచి మనసు ప్రశాంతం గా లేదు, ఏమి తినాలని కూడా అనిపించలేదు. నేను కాదు అందరి పరిస్థితి అంతే, మద్యాహ్నం రెండిటికి పరిక్ష వెలుతుదారిలో కూడా ఒకోక్కడు అది గుర్తుందా ఇది గుతుందా? అది చెప్పు ఇది చెప్పు అంటూ భయపడుతూ వెళ్ళాము. అది ఆ మే ఎండలో, తినక, భయం తొ నీరసంగా చెమటలు కారుకుంటూ పరిక్ష హాలు లోకి వెళ్ళాము. పైన పంకాలు తిరుగుతున్నచెమటలు లీటర్లు లీటర్లు కారుతూనే వున్నాయి.

పరిక్ష పేపర్లు ఇచ్చారు, చూడగానే ఒక్కొక్కడి గుండెల్లో పెద్ద రాయి పడింది, ఒక్క ప్రశ్న కూడా తెలిసినవి లేవు. తెలిసి తెలియనట్టుగా అదా కాదా అన్నట్టుగా వున్నయి. ఒకరి మొకాలు ఒకరు చుసుకోన్నాము. ఏడుపు ఒక్కటే తక్కువ. తొలి ఇరువై నిముషాలలో క్లాసులో కొంత మంది డ్రాప్ అని లేచి పోయారు. విషయం ఏమిటంటే మా మాస్టారు క్లాసులో చెప్పేవారు. ఆ సబ్జెక్టు తొలి సారి పాస్ కాక పోతే చాల కష్టమని, అప్పటికి మా అన్నయ్యలు మూడేళ్ళ ముందు బ్యాచ్ వాళ్ళు ఇంకా ఆ సబ్జెక్టు అవ్వక కుస్తి పడుతున్నారు అని. నేను ఆలోచనలో పడ్డాను. కళ్ళలో నిరు తిరుగుతుంది. ఏమి చెయ్యాలి డ్రాప్ చెయ్యాల వద్దా అని ఆలోచిస్తున్నాను. అంతలోకి మా మాస్టారు వచ్చి మళ్ళి ముందు చెప్పిన మాట మళ్ళి చెప్పి,  డ్రాప్ చెయ్యవద్దని చెప్పాడు, ఇచ్చినా వాటి గురించి తెలిసినదంత రాయమన్నారు. కానీ మా వాళ్ళు డ్రాప్ చేసి వెళ్తూనే వున్నరు. సగం క్లాసు కాళి అయిపొయింది.

డ్రాప్ చేసిన పెయిల్ అయినట్టే పాసవటనికే కష్ట పడే సబ్జెక్టులో మార్కులు అవసరమా అనుకొని ఎదైతే అది అవుతుందని, రాయటం మొదలు పెట్టాను. మూడు గంటలు అయిపోయే వరకూ ఇచ్చిన వాటి గురించి ఏది తెలిస్తే అది వ్రాస్తూనే వున్నాను. టైం అయిపొయింది. పరిక్షలు అయిపోయాయి. సెలవలకి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే సరికి మార్కులు వచ్చి వున్నాయి, విషయం ఏంటంటే నా సబ్జెక్టుల అన్నింటిలోకి ఆ సబ్జెక్టు మార్కులే ఎక్కువ. ఆ సబ్జెక్టు రాసిన అతి కొద్ది మందిలో నేనే టాపర్ ని. ఆ తర్వాత సప్లి రాసి చాల మందికి ఇంకా మంచి మార్కులు వచ్చాయి అనుకొండి.  నాకు చాల ఇష్టమైన సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వస్తాయి అనుకొంటే ముక్కుతూ మూలుగుతూ పాసయ్యాను. హహ హతవిది. ఆ సంవత్సరం అన్ని సబ్జెక్టులు పాసయిన అతికొద్ది మందిలో నేనొకడిని. సమయానికి మా మాష్టారు నిజంగా దేవుడుల వచ్చి నా చేత పరిక్ష రాసేటట్లు చేశాడు. నేను ఆ తర్వాత ఏప్పుడు ఏ పరిక్ష డ్రాప్ చెయ్యలేదు. 

Tuesday 17 June 2014

ఓ ఆకస్మిక రైలు ప్రయాణం

ఇది నా జీవితంలో జరిగిన ఒక సంఘటన, మన సిస్టం ఎలా వుంది అనే దానికి ప్రత్యక్ష సాక్షము. అది 2005 జూన్ నేల అప్పుడే మన దగ్గర వర్షలు పడటం మొదలు అవుతున్నాయి. నేను నా ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఇంట్లో ఏవో వ్యవసాయం పనులు అంటే కంద చేనుకి కాపలాకి వెళ్ళేవాడిని, కంద మే నెలలో వేస్తారు, జున్ నేలలో మొలకలు వచ్చి పచ్చగా కనిపిస్తుంటాయి. వాటిని చూసి పసువులు వచ్చి తొక్కి ఆగం చేస్తాయి. అవి వచ్చే వేళలో జాగర్తగా వుంది మిగతా సమయంలో చెట్టుకింద నిద్రా పోవటమే. ఆరోజు శనివారం ఉదయం వెళ్లి మద్యహ్నం బోజనానికి ఇంటికి వచ్చాను. అమ్మ  అన్నం వడ్డించి, ఏదో లేటరు వచ్చింది నీకూ అని తెచ్చి పక్కన పెట్టింది. అది ఐఐటి నుంచి వచ్చిన ఎడ్మీషన్ లేటరు అని అర్ధం అయింది, సీటు వచ్చిందని ముందే తెలియంటం వలనా పెద్ద అనంద పడ వలసిన ఆవసరం రాలేదు. బోజనం పూర్తి చేసి వచ్చి చిన్నగా ఆరుబయట పందిరి కింద వేసిన నులక మంచం మీద పడుకొని, ఆ లెటర్ ఓపెన్ చేసి చూసాను. ఆ రోజు శనివారం వెంటనే సోమవారం లోపల ఎడ్మీషన్ ఫీజు కట్టాలని వుంది. మళ్ళి మళ్ళి చూసి సరిగానే వుందని నిర్ధరించుకొన్నాను.

లక్కీగా అంతక ముందు సంవత్సరం మా వురికి BSNL ల్యాండ్ లైన్లు వచ్చాయి, వెంటనే ఐఐటిలో వున్న నా స్నేహితునికి ఫోన్ చెశాను, ఎంత సేపు ట్రై చేసినా స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. తర్వత వాళ్ళ ఇంటికి చేస్తే వాడు ఇంటిలో వున్నాడు, వాడి స్నేహితులు కూడా ఎవరు ఐఐటిలో లేరని చెప్పాడు. ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. అప్పటికే 3:30 అయిపొయింది, వెంటనే బయలు దేరి వెళ్లటం తప్పితే వేరే మార్గం కానీపించలేదు. ఇంటిలో డబ్బులు అడిగాను, లేవు. ఆరోజు శనివారం బ్యాంకు కూడా మద్యహ్నం వరకే వుంటుంది. తెలిసిన వాళ్ళంధరిని అడిగి ఎంత వుంటే అంత తీసుకొని, అది పెద్ద మొత్తం కాకపోయినా పల్లెటురులలో అది ఉల్లో బ్యాంకు వుండటంతొ, ఆవసరం లేనిదే ఎవరు ఇళ్లలో డబ్బులు వుంచుకోరు. నలుగురి దగ్గర తీసుకొన్నాను. తెలిసిన వాళ్ళు విజయవాడలో వుంటే ఫోన్ చేసి, కథ అంత చెప్పి ఢిల్లీకి తర్వాత రైలుకి టికెట్ తీసుకోమని చెప్పాము. అయన చదువుకొన్న వాడు, ఐఐటి అంటే తెలుసు కనుక ఢిల్లీకి ఏదొక టికెటు తీసుకొని ఎక్కితే కష్టమని, అయన ఏదోకటి చుస్తాను వెంటనే బయలుదేరి విజయవాడ రమ్మన్నాడు. నేను హడావుడిగా బయలుదేరి విజయవాడ వెళ్లేసరికి 8:00 అయింది. అయన రైల్వే లో ఎవరో తెలిసిన వాళ్ళను పట్టుకొని వెయిటింగ్ లిస్టు టికెట్ సంపాదించాడు. తనతొ వాల్ల ఇంటికి తీసుకు వెళ్లడు. రైలు GT express రాత్రి 11:00కి, భోజనం చేసి బయలు దేరి రైల్వే స్టేషన్ కి 10:30 కి చేరుకోన్నం, అయన ఎవరో TTEని పట్టుకొని నాకు సీటు ఇప్పించాడు. ఆ TTEకి ఎంత ఇచ్చాడో తెలియదు గాని వాడు వచ్చి ఆ సీటు ఢిల్లీ వరకూ ఇచ్చినట్టుగా చెప్పాడు. ఆనందంగా TTEకి, మా అంకుల్ కి ధన్యవాదాలు చెప్పి వచ్చి పడుకొన్నాను. బాగా అలసి పోవటం వలనా వెంటనే నిద్రాపట్టేసింది.

ఉదయం 7:00కి ఎవరో వచ్చి లేపారు హిందీలో మాటలాడుతున్నారు, వారి బాద అర్ధం అయింది, ఆ సీటు వారిదంట. నేను ఈ సీటు నాకు ఢిల్లీ వరకు TTE ఇచ్చాడని ఇంగ్లీషులో చేప్తున్నాను, వాళ్లకి అర్ధం అవ్వటం లేదు. అంతలో పక్క సీటులో నిద్రా పోతున్న తమిళ్ అతను లేచాడు, ప్రాబ్లమ్ ఏమిటి అంటే చెప్పాను. అతను హిందీలో పెద్దగ వాళ్ళతో ఏదో తిట్టినట్టుగా చెప్పాడు. వాళ్ళు వెళ్లి ఒక గంట తర్వాత వేరే TTEని తీసుకొని వచ్చారు. వాడు వచ్చి నా సీటు వాడికి ఇచ్చేశాడు. నాకు ఏమి చెయ్యాలో తోచలేదు, వాడికి ముందున్న TTE తొ మాట్లాడాలని అడిగాను. వాడు విజయవాడ TTE జొన్ అయిపోయిందని దిగిపోయడని చెప్పాడు. మరి నా సీటు అంటే ఏమి కాళి లేవని వెళ్లి పోయాడు. అప్పటి వరకూ ఎప్పుడూ అంతధూరం ఒంటరిగా వెళ్లలేదు, అందులోనూ నాకు హిందీ రాదు, ఇంతక ముందు ఇంటర్వ్యూకి వెళ్ళిన హిందీ వచ్చిన స్నేహితులు తోడు వున్నారు. ఒక్కడినే అల బిక్కు బిక్కు మంటూ అదే సీటు లో సర్దుకొని కూర్చున్నాను. అధృష్ట వశాత్తు ఆ సీటులో వున్నవాడు రాత్రి 1:00కి గ్వాలియర్ లో దిగిపోయాడు ఆప్పుడు మళ్ళి అక్కడ నిద్రా పోయాను.

ఉదయం 7:00కి దిగి రైల్వే స్టేషన్ లోనే ముకం కడుకొని, తయరై ఐఐటికి చేరుకొనె సరికి 9:00 అయ్యింది. DD కోసం లైన్లో నిలబడి కట్టాను. అది మద్యాహ్నం 1:00 కి ఇచ్చారు. మన  ఆంధ్రలో వానలు పడుతున్న ఢిల్లీ లో మాత్రం నడి వేసవి, ఉష్ణోగ్రతలు 50 కి దగ్గరగా వున్నయి. అది తీసుకొని వచ్చేసరికి లంచ్ హవర్ అని 2:00 తర్వాత రమ్మన్నారు, 2:00కి వెళితే సంభందించిన వాళ్ళు 3:00కి వచ్చాడు. వెళ్లి DD ఇస్తే అది కాదు, దానిని బ్యాంకులో కట్టి చలాన తీసుకొని రమ్మన్నాడు. వాడికి ఇంగ్లీష్ రావటం లేదు, నాకు హిందీ రాదు. వాళ్ళు DDనె అడిగారని చెప్పిన వినే పరిస్థితిలో లేడు. వాడితో వాదించి ప్రయోజనం లేదని, హడావుడిగా బ్యాంకుకి వెళ్లి  చలాన కట్టి వచ్చే సరికి 5:00 అయ్యింది.  చలాన తెచ్చి ఇస్తే దానిని రెండు కాపీలు జిరక్ష్ తీసుకొని రమ్మన్నాడు. జిరక్ష్ తీసుకొని వచ్చి వాడికి ఇచ్చేసరికి 5:30 అయ్యింది వాడు దానిని తీసుకొని లోపల వేసుకొని టైం అయిపోయిందని, ఆకనలేడ్జ్మెంట్ కూడా ఏమి ఇవ్వకుండా పంపించాడు. లక్కీగా తీసుకున్నాడు దానికి సంతోషించాను.

అప్పుడు  ఆలోచిస్తే, ఉదయం టిఫెన్ తర్వత ఏమి తినలేదు. రూం తీసుకోలేదు. ఎక్కడ వుండాలో తెలియదు. నేను ఆఫిసియల్ పని మీద రాలేదు, కనుక  ఐఐటి లో రూం ఇవ్వరు. తెలిసిన వాళ్ళు లేరు గెష్ట్ ల వుందమంటే. లక్కీగా  ఐఐటి లో తెలుగు వాళ్ళు ఎక్కువ వుండటం వలనా ఎవరో తెలుగు వాళ్ళు వెళ్తుంటే, వారి వెనుక వెళ్లి వాళ్ళని పరిచయం చేసుకొని, ఏదో రైల్వే స్టేషన్లో, బస్సు స్టాండులో కొంత మంది పట్టుకొని ఎవరో వాలెట్, లగేజ్ అంత కొట్టేసరని చెప్పినట్టుగా నా దిన గాధ అంత వారికి విన్నవించాను. వాళ్ళు నా బాధను అర్ధం చేసుకోన్నారో లేక ప్రాతియా  భావంతోనో వాళ్ళ రూంకి తీసుకేల్లరు, అక్కడ స్థానం చేసి, వల్లే కెంటిన్ కి తీసుకు వెళ్లారు. తిరుగు ప్రయాణం చెయ్యాలి. టికెట్ లేదు. అప్పుడు వెంటనే టికెట్ బుక్ చేయటానికి తత్కాల్ పద్ధతి కూడా లేదు. వాళ్ళ రూంకి  వెళ్లి ఇంటర్నెట్ లో తర్వత రైలులు ఏమున్నాయో చూస్తే ఉదయం 5:00 కి స్వర్ణ జయంతి express వుంది. ఆ సమయం కి అక్కడికి చేరాలంటే నడిరాత్రి  3:00 కి బయలు దెరలి. ఆటోలు దొరకాలి, అక్కడికి వెళ్లి టికెట్ తీసుకోవాలి చాల కష్టం.

అప్పటికే  10:00 అయిపొయింది, ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. ఎలా అయితే అల అయిందని 11:00 బయలుదేరి 12:00 కి నిజాముద్దీన్ స్టేషన్ చేరుకొన్నాను. అక్కడ వెయిటింగ్ లిస్టు టికెట్ కూడా దొరకలేదు. కొంచం సేపు మళ్ళి అలోచించి , వెనకకు వెళ్ళిన ఎక్కడ వుండాలో తెలియదు. బయట రూం తీసుకొన్న టిక్కెట్ ఎప్పుడూ దొరుకుతుందో తెలియదు, ఎలా అయితే అల అయిందని జనరల్ టిక్కెట్ తీసుకొన్నను. స్టేషన్ లోకి వెళితే దానికన్నా మన ఆంధ్రాలో ఏ చిన్న స్టేషన్ అయిన నయంగా వుంటాయి అనిపించింది. నాకు కూర్చోవాలని కూడా అనిపించలేదు. ఫ్లాట్ ఫాం నిండా ఎలుకలు తీరుతున్నాయి. ఎక్కడ చుసిన కిల్లిలు ఉసి వున్నాయి. పగలంత అలసి పోయి వుండటం వలనా నిద్రా మున్చుకోచేస్తుంది. అలానే నిద్రని ఆపుకుంటూ ఉదయం 4:30 వరకూ వున్నాను. స్వర్ణ జయంతి express వచ్చి  ఫ్లాట్ ఫాం మీద ఆగింది. వెళ్లి జనరల్ భోగీలు చూసాను అంత కాళిగా వున్నాయి, నా ప్రాణం లేచి వచ్చింది. అంత ఉదయం అవ్వటం వలనా ఎవ్వరు లేరు. నా అదృష్టం ఏమిటంటే ఆ రైలులో ఎక్కి పైన పడుకొన్నాను,  విజయవాడ వరకూ నన్ను ఎవరు కదపలేదు. అంటే ఆ రైలు జనరల్ భోగీలు అంత కాళిగా వున్నాయన్న మాట. ఆరోజు అంత రైలులో వుండి మర్రోజు మధ్యాహ్నం 12:00కి విజయవాడలో దిగాను.

ఐఐటి ఎడ్మీషన్ లేటరు లేటుగా పంపాడో, పోస్ట్ లో లేటుగా వచిందో తెలియదు కానీ వాడి ఈ చిన్న తప్పిదం నాకు నాలుగు రోజులు నరకం చూపించాయి, అందులో మూడు రోజులు రిజర్వేషన్ లేని రైలు ప్రయాణం ఉహించుకోండి. ఆ  తర్వత ఏన్ని సార్లు ఢిల్లీ వెళ్ళిన ఆ ప్రయాణమే మర్చిపోలేని ప్రయాణంగా మిగిలింది. ఇంక ఆ ప్రయాణం లో చాల మర్చిపోలేని విషయాలు వున్నాయి రాస్తూ పోతే వస్తూనే వుంటాయి.

Monday 16 June 2014

మనుషులు నాలుగు తరగతులు

ఇది నా సొంత కథ కాదు అల అని అంత కాపి కొట్టలేదు. నేను హైదరాబాద్ లో వుందనగా రామకృష్ణమాట్ కి వెళ్లి అక్కడ ఇంగ్లీష కోర్స్ చెయ్యాలని చాల వుండేది. కానీ అక్కడ చేర్చుకోవటానికి మెరిట్ కన్నా ఎవరికి ఎంత ఆవసరం వున్నదో చూస్తారు పరిక్ష పెట్టి, ఆవేశంగా వచ్చిన వన్నీ రాసేస్తే అక్కడ ప్రవేశం లభించదు. అక్కడ అప్లికేషనులో చాల డిటేల్స్ తీసుకొని, అన్ని పరికక్షిమ్చి, ఎవరికైతే ఎక్కువ అవసరమనుకొంటారో వారికే  ప్రవేశం కల్పిస్తారు. అల వెళ్లి విఫల మైన వారిలో నేను ఒక్కడిని. నాకు ఎప్పుడూ పెద్ద పెద్ద పుస్తకాలు చదివే అలవాటు లేదు, తరగతి పుస్తకాలు తప్ప, అలా రామకృష్ణమాట్కి పలితలకోసం వెళ్లి, నిరసతొ వెనకకు తిరిగుదామని అన్కొంటు, ఎటు వచ్చాం కదా అంత చూద్దామని లోపలికి వెళ్ళాం అప్పటి వరకూ రామకృష్ణమాట్ గురించి వినటమే కానీ ఎప్పుడూ చూడలేదు. లోపలి వెళితే సాదువులు ఎవరి పనులు వారు చేసుకొంటూ, కాన్ఫరెన్స్ రూంలలో ఏవో క్లాసులు జరుగుతున్న బయట చాల ప్రశాంతంగా మా వురి గుడిలా చాల ప్రశాంతం గా వుంది. మా వురి గుడిలా అని ఎందుకన్నానంటే మా ఉరు పల్లెటూరు కావటంతొ వచ్చే వాలందరు ఉదయాన్నే వచ్చి వెళ్లి పోతారు. మేము ఏదొక ఆటలాడి వచ్చి గుడి వరండలో పడుకునే వాళ్ళము. గుడికి పెద్ద ప్రహరి వుండటం వలనా నిర్మనుషంగా వుండేది, చాల ప్రశాతంగా వుండేది, అల రెండు, మూడు గంటలు నిద్రా పోయి లేచి ఇళ్లకు వెళ్ళే వాళ్ళం. రామకృష్ణమాట్ లోపల ఒక బుక్ షాప్ కూడా వుంది. మా స్నేహితులు అందరు ఆవేశంతొ పెద్ద పెద్ద చేతికి దొరికిన పుస్తకాలు అన్ని కొన్నారు. నేను కొందాము అనుకున్నాను కానీ పెద్ద పుస్తకాలు అందులోను ఇంగ్లీష్ అని చాల అలోచించి, 12/10 చిన్న చిన్న పుస్తకాలు, ఎంతవంటే అన్జేనేయ స్వామి దండకం పుస్తకాలు అంత చిన్న పుస్తకాల బండిల్ తీసుకొన్నాను. ఒక్కొకటి  ఒక్కొక వివేకానందుని భోదనలు. వాటిని చదవటానికి సంవత్సరం పైన పట్టింది.

దానిలో కథే ఇది, తరగతులు అని ఎందుకు అన్ననంటే, తరగతులలో పైకి పోవటం తప్పితే కిందకు వుండదు.

Physical Maturity
Mental Maturity
Intellectual Maturity
Spiritual Maturity

విటిని నేను అర్ధం చేసుకొన్నా విధంగా చెప్తాను,
మొదటిది భౌతిక పరిణితి ఇది మన శరీరం ఎదుగుదల, మనం ఆరోగ్యంగా వుంటేనె వేరే వాటి గురించి అలోచిన్చాగలం, అందుకని పిల్లలని లెక్కలు, ప్రార్ధనలు కన్నా ఫుట్ బాల్ ఆడమని చేప్తాడు వివేకానందుడు.

రెండవది Mental Maturity ఇది మన మెదడు పరిణితి, మెదడు పనిచేస్తుంది కానీ ఆలోచనలను అరికట్టలేము. లెక్కలు చెయ్యగాలం కానీ ఆవేశం, ఓర్పు ఇలాంటి బావోద్వేగల వంటి వాటిని అపుకోలేరు.

మూడవది మానసిక పరిణితి ఇక్కడ చాల పరిణితిగా అలోచిస్తారు. జీవితం మీద పూర్తి అవగాహన వుంటుంది. ఒక పని చేసి తర్వత బాధపడాల్సిన ఆవసరం రాదు. బావోద్వేగలు వుంటాయి కానీ కట్టు దాటవు.

నల్గోవది Spiritual Maturity, బావోద్వేగలు వుండవు, అన్ని సమానంగా చూసే స్థితి. ఇది సాదువులకి వుండవలసినది.

మనం అంత Mental Maturity/Intellectual Maturity లో ఏదో తెలియని స్థితిలో వుంటాము,  బావోద్వేగల మీద కొంచం పట్టువుంటుంది అల అని పూర్తిగా వుండదు.







Friday 13 June 2014

నాలోని కవి

నాదొక విచిత్ర కోరిక
నేను కవిని కాదు
అవ్వలని ఆశ లేదు
కాని ఎదో రాయలని

దానిని నా మనసుతొ నింపాలని
అందరికి నా హౄదయంతొ చుపాలని
అప్పుడప్పుడు అనిపిస్తూటుంది
నాలోను ఓ కవి వున్నడని

అప్పుడు పడతనొ కలం
ఎంచుకుంటనొ మంచి స్థలం
చేస్తాను అలుపెరగని అలొచనలు
అప్పుడు వ్రాస్తనొ కవిత

అది వుంటుంది చాల ముద్దుగా
తర్వాత అనిపిస్తుంది చెత్తగా
విసిరేస్తను కోపంతొ నీరసంగా
ఇలా వ్రాశను ఎన్నెన్నో కవితలు

ఎన్ని ఆలోచనలు రంగరించిన
ఎన్ని అనుభుతులు మేళవించిన
ఎన్ని అనుభవాలు చేర్చిన
అనిపిస్తుంది అసంపుర్తిగ

ఎదో లొటని పిస్తుంది!
అది అర్ధరహిత్యమో?
సాహిత్యం రాకో?
అనుభవ లోపమో? 

హౄదయం ఇమడ లెదనిపిస్తుంది
అది కవితే కాదనిపిస్తుంది
నేను కవిని కాదనిపిస్తుంది
నాలొ కవి లేడనిపిస్తుంది

అది ఆల ముగుస్తుందారోజుకి
కాని మనసు ఆగదు
మరొరోజు ఎదొ తెలియని ఆవేశం
నాలొని కవిని జాగౄతం చేస్తుంది

అది ప్రశాంతత కాని, అరాచకం కాని
నాలొని బాద కాని, సంతోషం కాని
నాకె తెలియని నాలొని ఆశనిరాశలు కాని
ఎవేవో నాలొ పొంగె అలల ఆటుపోటులు కాని

నా అనుభుతులు పంచుకొవలని పిస్తుంది
నా అలొచనలను క్రొడికరించలని పిస్తుంది
నాతొ కవిత రాపిస్తుంది
నా సమయం వౄద చెస్తుంది 

 

నాకె అర్ధంకాని, జవాబులేని ప్రశ్న!

నేను కవిని కాను, అవ్వాలని లేదు!
కాని కవితెందుకు రాయలని పిస్తుంది?
ఇది సద్వ్యాపకమా? దుర్వ్యసనమా? పిచ్చా?

నాలో కవి వున్నడ?
వుంటె ఆకవే! ఈకవా?
నేను అనుకుంటూ వుంటాను!
నేనొక కళాపిపాసిని అని!

మీ
సత్భోగి 

12th June 2012